Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటాలియ‌న్ మోడ‌ల్‌ను కూడా వ‌దిలి పెట్ట‌ని నిర్మాత హార్వీ... బ‌య‌ట‌ప‌డిన ఆడియో క్లిప్‌!

  • మోడ‌ల్‌ను లొంగ‌దీసుకోవ‌డానికి హార్వీ విశ్వ‌ప్ర‌య‌త్నం
  • ఆడియో క్లిప్‌ను ప్రసారం చేస్తున్న అమెరిక‌న్ ఛాన‌ళ్లు
  • హార్వీ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌కు ఆడియో ఆధారం
ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను లైంగికంగా వేధించాడ‌ని ఇప్ప‌టికి పలువురు న‌టీమ‌ణులు వెల్ల‌డించారు. త‌మ‌ను హోట‌ల్ గ‌దికి ర‌మ్మ‌ని, త‌మ ముందే దుస్తులు లేకుండా తిరిగేవాడ‌ని, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని వారంతా ఆరోపించారు. 2015లో ఫిలిప్పీన్స్‌-ఇటాలియ‌న్ మోడ‌ల్ అంబ్రా బాటిలానా గుటెరెజ్‌ను కూడా లొంగ‌దీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే ఆ స‌మ‌యంలో న్యూయార్క్ పోలీసు స‌హాయంతో ఆమె ఒక స్టింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. దీంతో ఆమెతో హార్వీ అస‌భ్యంగా మాట్లాడుతున్న మాట‌ల‌న్నీ రికార్డ‌య్యాయి. ఇప్పుడు ఆ టేపు అమెరికా న్యూస్ ఛాన‌ల్స్‌లో ప్రసార‌మ‌వుతోంది.

ఆ ఆడియోలో గుటెరెజ్‌ను ఒప్పించ‌డం కోసం హార్వీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. అందుకోసం తాను పైకి తీసుకువ‌చ్చిన న‌టీమ‌ణుల వివ‌రాల‌ను హార్వీ అందులో వెల్ల‌డించ‌డం, గుటెరెజ్‌ను మంచి స్థాయికి తీసుకెళ్తాన‌ని మాటివ్వ‌డం లాంటి ప‌నులు చేశాడ‌ని రికార్డింగ్‌ను పూర్తిగా విన్న న్యూయార్క్ రిపోర్ట‌ర్ రోన‌న్ ఫారో తెలిపారు. సెక్యూరిటీ అంశాల దృష్ట్యా ఆ రికార్డింగ్‌లోని ద్వితీయార్థాన్ని మాత్ర‌మే వార్తా ఛాన‌ళ్లు ప్ర‌సారం చేస్తున్నాయి. గుటెరెజ్ ఎంత వారిస్తున్నా... హోట‌ల్ గ‌ది లోప‌లికి ఆమెను పిల‌వ‌డం, తాను గొప్ప వ్య‌క్తిన‌ని చెప్పుకుంటూ అస‌భ్య కోరిక‌లు కోర‌డం, ఇబ్బందికి గురిచేయ‌డం ఈ ఆడియోలో వినొచ్చు.

italian model
harvey weinstein
audio clip
groping
seducing
hollywood

More Telugu News